భారీ బందోబస్తు మధ్య దేవాలయం, దర్గా కూల్చివేత

భారీ బందోబస్తు మధ్య దేవాలయం, దర్గా కూల్చివేత

ఢిల్లీ భజన్‌పురాలోని హనుమాన్ మందిర్, మజార్‌లను PWD కూల్చివేసింది. నివేదికల ప్రకారం, ప్రతిపాదిత రోడ్డు విస్తరణ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేయడానికి ఈ కూల్చివేత డ్రైవ్ ను నిర్వహించింది.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో జూలై 2న ఉదయం దేవాలయం, దర్గాను  పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) అధికారులు కూల్చివేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య భజన్ పురా చౌక్ లోని హనుమాన్ దేవాలయం, దర్గాను కూల్చివేసిన అధికారులు.. ప్రతిపాదిత రోడ్డు విస్తరణ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసేందుకు ఈ కూల్చివేత చర్య చేపట్టినట్టు తెలిపారు.  

ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో హనుమాన్ ఆలయం, మజార్‌ను తొలగించడానికి పీడబ్ల్యూడీ చేపట్టిన ఆక్రమణ నిరోధక డ్రైవ్ ప్రశాంతంగా పూర్తయిందని పోలీసులు తెలిపారు. రెండు నిర్మాణాలను తొలగించాలని డిల్లీలోని మతపరమైన కమిటీ నిర్ణయం తీసుకుందని, స్థానికుల మద్దతుతోనే డ్రైవ్ నిర్వహించినట్టు వెల్లడించారు.

ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో, PWD విభాగానికి చెందిన బృందం భద్రతా బలగాలతో కలిసి చౌక్ ప్రాంతంలోని హనుమాన్ మందిర్, మజార్‌ల తొలగింపు డ్రైవ్‌ను ప్రారంభించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బలగాలను కూడా మోహరించారు. ఈ నిర్మాణాల కూల్చివేతపై సంబంధిత వ్యక్తులకు PWD నోటీసులు అందించినా, వారు ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు SDM శీలంపూర్ శరత్ కుమార్ తెలిపారు.

https://twitter.com/ANI/status/1675355600589590529