సిసోడియా పిటిషన్​పై ఏమంటరు?.. సీబీఐ, ఈడీకి కోర్టు నోటీసులు

సిసోడియా పిటిషన్​పై ఏమంటరు?.. సీబీఐ, ఈడీకి కోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఆప్ లీడర్ మనీశ్ సిసోడియా దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్​పై అభిప్రాయాలు తెలియజేయాలని సీబీఐ, ఈడీని ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశించింది.

ఈ నెల 20లోగా తమ అప్లికేషన్లు ఫైల్ చేయాలని తెలిపింది. సీబీఐ, ఈడీకి స్పెషల్ జడ్జి కావేరీ బవేజా శుక్రవారం నోటీసులు జారీ చేశారు. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాను పోయినేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. ఇక ఇదే స్కామ్​లో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి అదే ఏడాది మార్చి 9న ఆయనను ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం సిసోడియా తీహార్ జైల్లో ఉన్నారు.