కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వ్

కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వ్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీపై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిసాయి. కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీ కోరింది ఈడీ. తన అరెస్ట్ అక్రమమని కేజ్రీవాల్ తరపు లాయర్లు వాదించారు.  ఇరువురి వాదనలు విన్న  కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 

మద్యం పాలసీతో   సౌత్ గ్రూప్ నుంచి వచ్చిన ముడుపులు రూ.45 కోట్లను కేజ్రీవాల్ గోవా ఎన్నికల్లో  వాడారని ఈడీ కోర్టులో వాదించింది.  ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ సూత్రధారి అని, కింగ్ పిన్ అని ..మద్యం పాలసీలో కేజ్రీవాల్ సౌత్ గ్రూపుకు అనుకూలంగా ఉన్నారని తెలిపారు. లిక్కర్ కేసులో అప్రూవర్లు ఇచ్చిన సమాచారంతో  కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని .. కేసులో సరైన ఆధారాలు  లేవని కేజ్రీవాల్ ను  అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటని..ఆయన తరపు న్యాయవాదులు వాదించారు.