
ఢిల్లీని పొగమంచు వీడడం లేదు. దీంతో రైళ్లు, విమాన ప్రయాణాలు ఆలస్యమవుతున్నాయి. ఢిల్లీలో 16 రైళ్లు పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత 24 గంటల్లో 1 మిల్లీమీటర్ వర్షం కురిసింది. ఇవాళ కూడా ఉరుములు మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. లూథియానా, సిమ్లా, డెహ్రాడూన్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ పడిపోయింది.
16 trains to Delhi running late due to fog. pic.twitter.com/bHGI4vNbtM
— ANI (@ANI) February 7, 2019