ఢిల్లీతో మ్యాచ్.. ముంబై టార్గెట్-163

ఢిల్లీతో మ్యాచ్.. ముంబై టార్గెట్-163

అబుదాబి:  ఐపీఎల్ సీజన్-13లో భాగంగా ఆదివారం అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌  ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెటిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి162 రన్స్ చేసింది. ఢిల్లీ స్టార్టింగ్ లోనే పృథ్వీ షా(4) వికెట్‌ను కోల్పోయింది. బౌల్ట్‌ బౌలింగ్‌లో కృనాల్‌ పాండ్యా క్యాచ్‌ పట్టడంతో పృథ్వీ షా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో ధావన్‌కు రహానే జత కలిశాడు. రహానే వచ్చీ రావడంతో మంచి టచ్‌లో  కనిపించాడు.

రహాన్‌ మూడు ఫోర్లతో 15 పరుగులు చేసి పెవిలియన్‌ చేరడంతో ..ఢిల్లీ 24 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆపై ధావన్‌-అయ్యర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(42), శిఖర్‌ ధావన్‌(69 నాటౌట్ ‌)లు రాణించడంతో ఢిల్లీ గౌరవ ప్రధమైన స్కోర్ చేసింది. ఈ జోడి 85 పరుగుల జోడించిన తర్వాత అయ్యర్‌ ఔట్‌ కాగా, స్టోయినిస్‌(13) కూడా ఎ‍క్కువ సేపు క్రీజ్‌లో  ఉండలేకపోయాడు. ధావన్‌తో సమన్వయం లోపంతో స్టోయినిస్‌ రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ధావన్‌ లాస్ట్ వరకూ క్రీజ్‌లో ఉండటంతో పాటు అలెక్స్‌ క్యారీ( 14 నాటౌట్‌) ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

ముంబై బౌలర్లలో కృనాల్‌ పాండ్యా రెండు వికెట్లు తీయగా , ట్రెంట్‌ బౌల్ట్‌కు వికెట్‌ దక్కింది.