లైంగిక వేధింపులు తాళలేక.. ట్యూటర్​ హత్య

లైంగిక వేధింపులు తాళలేక.. ట్యూటర్​ హత్య

న్యూఢిల్లీ:  ఢిల్లీలో14 ఏండ్ల బాలుడు తన ట్యూటర్​ను హత్య చేశాడు. ట్యూటర్​(28) బాలుడిపై పలుమార్లు లైంగిక దాడి చేయడమే హత్యకు దారి తీసిందని పోలీసులు తెలిపారు. బాలుడిపై లైంగిక దాడికి సంబంధించి ఓ వీడియో కూడా తీశాడని చెప్పారు. లైంగిక వేధింపులు తట్టుకోలేక పదునైన పేపర్ కట్టర్ తో ట్యూటర్​ను బాలుడు మెడ వద్ద పొడిచి చంపాడన్నారు. హత్య జరిగిన మూడు రోజుల అనంతరం శుక్రవారం బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

జామియానగర్​లోని బాట్లా హౌస్​ సెకండ్​ఫ్లోర్​లో ఓ రూమ్ నుంచి రక్తం బయటకు వస్తోందంటూ ఆగస్టు 30న పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. స్పాట్​కు చేరుకున్న పోలీసులు ట్యూటర్​ డెడ్​బాడీని గుర్తించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హోమోసెక్సువల్​అయిన ట్యూటర్ ​రెండు నెలల క్రితం బాలుడిపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. వీడియో తీసి సోషల్​మీడియాలో అప్​లోడ్​ చేస్తానని బాలుడిని బ్లాక్​మెయిల్​చేశాడని వెల్లడైంది.