
సొసైటీలో అవరేర్‌నెస్ కల్పించడంలో టీచర్లు ముందుంటారు. మంచి చెడు చెప్పడానికి ఏమాత్రం వెనుకాడరు సదువు చెప్పే సార్లు. కానీ ఇక్కడ కాస్త వెరైటీగా జరిగింది. ఇటీవల ఢిల్లీ యూనివర్సిటిలో ప్రొఫెసర్లు ఫ్యాషన్ షో నిర్వహించి మనం దరించే దుస్తులు ఎందుకు జండర్ ను తెలియజేయాలని చాటి చెప్పాలనుకున్నారు. దీనికోసం వారు ఓ స్పెషల్ థీమ్ ఫ్యాషన్ షో చేశారు. జెంట్ ప్రొఫెసర్లు ఆడవారి వేషధరణ, లేడీ ప్రొఫెసర్లు మగవారి వేషధరణలో ర్యాంప్ వాక్ చేశారు.
The virus has reached India ?? pic.twitter.com/mtrFEsDa9q
— desi mojito ?? (@desimojito) May 23, 2024
మగవారు చీరలు, ఘాగ్రా చోళీ, పంజాబీ డ్రెస్, హాఫ్ సారీతో రాగా.. మహిళా టీచర్లు షర్ట్, ప్యాంటు, షర్ట్ లో వచ్చారు. దాదాపు 10మంది యూనివర్సిటీ అధ్యాపకులు ఈ ర్యాంపు వాక్ లో పాల్గొన్నారు. వారిలో కొందరు జోడీగా, కొందరు సోలోగా ఫర్మామెన్స్ చేశారు. అనాదిగా మూస పద్ధతులకు స్వస్తి చెప్పాలని వారి ఈ ప్రయత్నం చేసినట్లు చెప్పారు. ఈ ఫ్యాషన్ షో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసినవారందరూ వారికి తోచిన మీమ్స్, కాంమెట్లతో రియాక్ట్ అవుతున్నారు. ఈ క్లిప్ షేర్ చేసుకుంటూ వైరల్ చేస్తున్నారు. చాలాచోట్లు ఇలాంటివి విద్యార్థులతో చేపిస్తారు.. కానీ ఇక్కడ అధ్యాపకులే చేయడం విశేషం.