భారీ వర్షం... రైల్వే స్టేషన్‌లో కరెంట్ షాక్తో మహిళ మృతి

  భారీ వర్షం...  రైల్వే స్టేషన్‌లో కరెంట్ షాక్తో మహిళ మృతి

దేశ రాజధాని ఢిల్లీలో 2023 జూన్ 24 శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దురదృష్టవశాత్తు ఓ మహిళా కరెంట్ షాక్ తో మృతి  చెందింది.  తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్‌కు చెందిన సాక్షి అహుజా  2023 జూన్ 24  ఆదివారం  ఉదయం 5:30 గంటలకు ముగ్గురు పిల్లలతో కలిసి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది.  వర్షం కారణంగా నీరు నిలిచి ఉండగా సపోర్ట్ కోసం ఆమె పక్కనే ఉన్న ఓ విద్యుత్ స్తంభాన్ని పట్టుకుంది. ఈ క్రమంలో ఆమెకు కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయింది. 

ఇవి కూడా చదవండి: తెలంగాణలో భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ

దీనిని  గమనించిన  కొందరు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అహుజా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ఎగ్జిట్ నంబర్ వన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని  పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. కరెంట్ స్థంభం వద్ద విద్యుత్ వైర్లు నిర్లక్ష్య రీతిలో కనిపించాయని బాధితురాలి సోదరి మాధవి చోప్రాఆరోపించారు.  సంబంధిత అధికారుల నిర్లక్ష్యానికి ఆరోపిస్తూ ఆమె పోలీసులకు  ఫిర్యాదు చేసింది, ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

2023 జూన్ 24  ఆదివారం రోజున ఢిల్లీలో 5 సెంటీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైందని, రానున్న రెండు రోజులు వర్షం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు.