
బషీర్ బాగ్, వెలుగు : ఇన్‌స్టాలో హైదరాబాద్కు చెందిన బాలికను వేధిస్తున్న ఢిల్లీ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. సిటీకి చెందిన బాలికకు ఇన్‌స్టాగ్రాంలో ఢిల్లీకి చెందిన యువకుడు(29) ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిచాడు. వాట్సాప్ నంబర్ తీసుకుని చాట్ చేశాడు. బాలిక ఇన్‌స్టాలో అప్లోడ్ చేసిన ఫొటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ గా మార్చాడు. తర్వాత తాను చెప్పినప్పుడల్లా డబ్బులివ్వాలని లేదంటే మార్ఫింగ్ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యా దు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.