వడగాలుల తీవ్రతకు జనం ఇబ్బందులు

వడగాలుల తీవ్రతకు జనం ఇబ్బందులు

దేశవ్యాప్తంగా వడగాలుల తీవ్రతకు జనం ఇబ్బందులు పడుతున్నారు. హర్యానాలోని గురుగ్రామ్ లో ఎన్నడూ లేనంతగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటి వరకు అక్కడ ఆ రికార్డు 44.8 డిగ్రీలుగా ఉండేది. పొరుగున ఉన్న ఢిల్లీలో గత 12 ఏళ్లలో అత్యంత వేడి రోజుగా రికార్డులకెక్కింది. ఉత్తపరప్రదేశ్ లోని అలహాబాద్, మధ్య ప్రదేశ్ లోని ఖజురహో, నౌగాంగ్, ఖర్గోన్ ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో గురువారం దేశంలో విద్యుత్ డిమాండ్ గతంలో ఎన్నడూ లేనంత గరిష్ఠంగా 204.65 గిగా వాట్లను తాకింది. వాయువ్య, మధ్య భారత్ లో వచ్చే ఐదు రోజుల పాటు, తూర్పు భారత్ లో రానున్న మూడు రోజుల పాటు వడ గాలుల తీవ్రత కొనసాగుతుందని అంచనా వేసింది భారత వాతావరణ శాఖ. వాయవ్య భారత్ లోని అధిక ప్రాంతాల్లో వచ్చే రెండ్రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.

మరిన్ని వార్తల కోసం

మండుటెండలో వినూత్నంగా పెళ్లి బరాత్

పెళ్లిలో నాగిన్ డాన్స్ కోసం నిజమైన కోబ్రా