రెడ్​ఫోర్ట్ తాత్కాలికంగా మూసివేత

రెడ్​ఫోర్ట్ తాత్కాలికంగా మూసివేత

రెడ్​ఫోర్ట్​ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ చుట్టూ పోలీసులు, పారా మిలటరీ బలగాలను మోహరించారు. భద్రతా కారణాల వల్లే మూసివేసినట్టు తెలిపారు. 

సెక్యూరిటీ ఏజెన్సీల తదుపరి ఆదేశాలు వచ్చేదాకా రెడ్​ఫోర్ట్​ను ఓపెన్ చేయబోమని పోలీసులు వివరించారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో మెట్రో స్టేషన్లలోని ప్రధాన గేట్లను కూడా మూసివేశారు. ఒకే దారి గుండా ప్రయాణికులను లోపలికి అనుమతిస్తున్నారు.