అత్తాపూర్లో డెలివరీ బాయ్పై దాడి చేసి బైక్ లాక్కున్నరు

అత్తాపూర్లో డెలివరీ బాయ్పై దాడి చేసి బైక్ లాక్కున్నరు

రంగారెడ్డి  జిల్లాలో దారుణం జరిగింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ జలాల్ బాబా నగర్ లో  నజీమ్  అనే డెలివరీ బాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడ్‌లతో దాడి చేసి దోచుకున్నారు . నకిలీ ఆర్డర్ ఇచ్చి డెలివరీ బాయ్‌ను రప్పించారు.  అతను లొకేషన్ కు  రాగానే  కళ్లల్లో స్ప్రే కొట్టి, బ్లేడ్‌లతో విచక్షణారహితంగా దాడి చేశారు. అతని దగ్గర ఉన్న ఫోన్, ద్విచక్ర వాహనం, డబ్బులు లాక్కొని పరారయ్యారు. డెలివరీ బాయ్  అరుపులతో  స్థానికులు రాగానే దుండగులు పారిపోయారు.వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గాయాలతో బాధపడుతున్న డెలివరీ బాయ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

►ALSO READ | ఇంత దారుణమా.. సిగరెట్ ఇవ్వలేదని సాఫ్ట్వేర్ ఇంజినీర్ను కారుతో గుద్ది చంపాడు

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతం ఎప్పుడూ చిమ్మచీకటిగా ఉంటుందని, తరచుగా ఇలాంటి దారిదోపిడీలు జరుగుతున్నాయని వారు వాపోతున్నారు. గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని  వెంటనే వారిని అరికట్టాలని స్థానికులు పోలీసులను వేడుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.