మమ్మల్ని రెగ్యులర్ చేయండి

మమ్మల్ని రెగ్యులర్ చేయండి
  • కాంట్రాక్ట్ ఏఎన్ఎంల డిమాండ్ 

ముషీరాబాద్, వెలుగు : కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మానవహారంతో  నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర అధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాత పరీక్ష ద్వారానే పోస్టులను భర్తీ చేస్తామని చెప్పడంతో కాంట్రాక్ట్ లో 20 ఏండ్లుగా పనిచేస్తున్న ఏఎన్ఎంలు తీవ్రంగా నష్టపోతారన్నారు.

ప్రభుత్వం ఎలాంటి రాత పరీక్ష లేకుండానే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు కవిత, కిరణ్మయి, రాజేశ్వరి, లక్ష్మి, అమ్మాజీ, విజయ, ప్రణయశీల తదితరులు పాల్గొన్నారు.

ఎన్​హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి

బషీర్​బాగ్ : రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లోని నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఎన్​హెచ్ఎం కాంట్రాక్ట్ ,  ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు  ఎన్. శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మిషన్ డైరెక్టర్, ఎన్​హెచ్​ఎం కమిషనరేట్ ఆఫీసు ముందు మంగళవారం ఉద్యోగులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా శ్రవణ్​కుమార్ మాట్లాడుతూ.. జీవో నం.510తో అన్యాయానికి గురైన ఉద్యోగులకు వెంటనే ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.

ఎన్​హెచ్ఎంలో 17 వేల మంది 25 ఏండ్లుగా జనానికి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్​హెచ్ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ హెచ్ఆర్ పాలసీ , బీమా సౌకర్యం కల్పించాలని, ట్రెజరీ ద్వారా జీతాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్​హెచ్​ఎం కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎండీ కరీం, బాలసుబ్రమణ్యం, నరేశ్​, రమేశ్ తదితరులు