పోస్టర్లు ఆవిష్కరించిన ఎస్ఎఫ్ఐ నేతలు
హైదరాబాద్, వెలుగు : కొత్త జాతీయ విద్యా విధానం ‑ 2020ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆదివారం ప్రకటించింది. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేలా జాతీయ విద్యా విధానం ఉందని మండిపడింది. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చలో రాజ్‌భవన్‌కు సంబంధించిన పోస్టర్లను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శు లు ఆర్ఎల్.మూర్తి, నాగరాజు రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో విద్యారంగానికి తీవ్ర నష్టం ఏర్పడుతున్నదని, ప్రైవేటు కార్పొరేట్ రంగానికి లాభం చేకూరేలా ఉందని విమర్శించారు. ఈ విధానంతో ప్రైమరీ ఎడ్యుకేషన్ లో భారీగా డ్రాపౌట్స్ పెరిగే అవకాశం ఉందన్నారు.

