దాడి చేసిన ఎస్పీపై చర్య తీసుకోవాలి: టీజేఎఫ్ వోఏ సర్కిల్ రిప్రజింటేటర్

దాడి చేసిన ఎస్పీపై చర్య తీసుకోవాలి: టీజేఎఫ్ వోఏ సర్కిల్ రిప్రజింటేటర్

ములుగు, వెలుగు : మేడారం డ్యూటీలో ఉన్న ఫారెస్ట్​బీట్​ఆఫీసర్ పై ఎస్పీ గౌస్ ఆలంతో పాటు ట్రైనీ ఐపీఎస్ దాడికి పాల్పడడం సరికాదని, వారిపై చర్యలు తీసుకోవాలని టీజేఎఫ్ వోఏ సర్కిల్ రిప్రజింటేటర్ బి.సంబు డిమాండ్ చేశారు. జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ములుగు డీఎఫ్ వో రాహుల్ కిషన్​జాదవ్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సంబు మాట్లాడుతూ ఏటూరునాగారం సర్కిల్​వాజేడు పరిధిలో పనిచేసే బీట్ ఆఫీసర్ శ్రీనివాస్ ఈ నెల 23న తన భార్యను దర్శనానికి తీసుకెళ్లాడన్నారు.

ఇదే టైంలో అక్కడికి వచ్చిన ఓ ట్రైనీ ఐపీఎస్ బీట్ ఆఫీసర్ ను అడ్డగించి, గల్లా పట్టుకొని ఎస్పీ గౌస్​ఆలం వద్దకు తీసుకెళ్లగా ఆయన బూతులు తిడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. శ్రీనివాస్ భార్య ఎస్పీ కాళ్లు పట్టుకున్నా వదలకుండా కింద కూర్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బీట్​ఆఫీసర్ పై దాడి చేసిన ఎస్పీ, ట్రైనీ ఐపీఎస్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై మంత్రి సీతక్కకు ఫిర్యాదు చేస్తామని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో డిప్యూటీ రేంజర్లు పి.నరేందర్, సీహెచ్. శ్రీనివాస్, ఎం.కోటేశ్వర్, రాజేశ్, ఫారెస్ట్​సెక్షన్ ఆఫీసర్ ఎ​.శ్యాంసుందర్, బీట్​అధికారులు దీప్​లాల్ ఉన్నారు.