చీర్యాలలో 30 అక్రమ నిర్మాణాల కూల్చివేత

చీర్యాలలో 30 అక్రమ నిర్మాణాల కూల్చివేత

కీసర, వెలుగు: కీసర మండలం చీర్యాల గ్రామ పంచాయతీ పరిధిలో వెలసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. కొందరు అక్రమార్కులు గ్రామంలోని చెరువులు, కుంటలు, నాలాలను కబ్జా చేసి, ఎఫ్​టీఎల్, బఫర్​జోన్ల పరిధిలో లేఅవుట్లు వేయడంతోపాటు ఇండ్లు నిర్మిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

పంచాయతీ నుంచి గానీ, హెచ్ఎండీఏ నుంచి కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే లేఅవుట్లు చేసి, ఒక్కో ప్లాట్ ను రూ.40లక్షల నుంచి రూ.50లక్షలకు అమ్మేస్తున్నట్లు తెలుసుకున్నారు. కలెక్టర్​ఆదేశాలతో సదరు నిర్మాణాలను బుధవారం కూల్చివేశారు. మొత్తంగా 30 బిల్డింగులను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ ను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.