
సిద్దిపేట రూరల్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని.. నెల రోజుల్లో సిద్దిపేటకు నీళ్లు వస్తాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతిలో కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. త్వరలోనే కాలువల ద్వారా గ్రామానికి గోదావరి జలాలు వస్తయి.. యాసంగి పంటకు నీరు అందుతాయన్నారు. రెండు పంటలు పండించి వెంకటాపూర్ సస్యశ్యామలం అవుతుందన్నారు. అలాగే కొంత స్థలం ఇస్తే గొర్రెలకు హాస్టల్ కడదామని సూచించారు. గొర్రెల హాస్టల్‌తో గ్రామం శుభ్రంగా మారి రోగాలు దూరమవుతాయని వివరించారు. ఇందుకోసం గొల్ల, కుర్మలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
గొర్రెలకు షెడ్ కోసం స్థలాన్ని తహసీల్దార్ సేకరించి ఇవ్వాలని. అలాగే గ్రామస్తులు అందరికీ కలిసి ఓ ఫంక్షన్ హాల్ స్థలం చూడలన్నారు. సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో అందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో భాగంగా ఇండ్ల కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ సొంతూరు పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలలో భాగంగా మంత్రి హరీశ్ రావు మంగళవారం చింతమడక హామ్లెట్ గ్రామాలు అంకంపేట, దమ్మచెరువు గ్రామాల్లో ఇండ్ల కూల్చివేత ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ప ది లక్షల సాయం, డబుల్ ఇండ్ల నిర్మాణం చేస్తానన్న సీఎం హామీ మేరకు ఇండ్ల నిర్మాణాల కోసం పనులు వేగవంతం అయ్యాయన్నారు. పక్కా ఇండ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక నివాసాల్లో ఉండాలని, అక్కడ అన్ని సౌకర్యాలు
కల్పిస్తామన్నారు.