బీఆర్ఎస్ నేత చేపట్టిన అక్రమ నిర్మాణం కూల్చివేత

బీఆర్ఎస్ నేత చేపట్టిన అక్రమ నిర్మాణం కూల్చివేత

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మండలం  లోని కన్నాల గ్రామపంచాయతీ సర్వే నెంబర్ 112లో సుమారు రెండెకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి బీఆర్ఎస్ నేత సిల్వేరు నర్సింగం నిర్మించిన ప్రహరీని రెవెన్యూ అధికారులు మంగళవారం కూల్చివేశారు.

తహసీల్దార్ జ్యోత్స్న ఆధ్వర్యంలో రెవెన్యూ ఇన్​స్పెక్టర్ ఆదిలక్ష్మి, సిబ్బంది సూరం ప్రసాద్ ఆక్రమిత భూమి చుట్టూ నిర్మించిన ప్రహరీని పరిశీలించి కూల్చివేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.