తిరుమలలో వెయ్యేళ్ల నాటి పారువేట మండపం కూల్చివేత

తిరుమలలో వెయ్యేళ్ల నాటి పారువేట మండపం కూల్చివేత

తిరుమలలో మరో చారిత్రాత్మకమైన కట్టడాన్ని కూల్చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.  తిరుమల నుండి పాపవినాశం మార్గానికి వెళ్లే దారిలో రాయల కాలంలో నిర్మితమైన ఈ రాతి మండపం కింది భాగాన్ని అలాగే ఉంచి, పై భాగంలో స్వామివారిని కొలువు తీర్చి..   ఉత్సవ సేవలు నిర్వహించే  పురాతన రాతిమండపాన్ని పూర్తిగా తొలగించాలని అధికారులు నిర్ణయించారు. 

ఈ మేరకు గత రెండు రోజులుగా ఈ మండపాన్ని కూలదోసే పనులు చేపట్టారు. ఈ స్థానంలో మరింత ఆకర్షణీయంగా  నూతన మండప నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు.. ఈ రాతి మండపం పై భాగంలో టీటీడీ నిర్మించిన దేవత మూర్తుల ప్రతిమలను సైతం పగలగొట్టి కింద పడదోశారు. మరో రెండు రోజుల్లో రాతి మండపాన్ని కూలదోసి ఆస్థానంలో నూతన నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నారు. 

అలాగే కింది భాగంలో ఉన్న రాతి మండపం సైతం పూర్తిగా నిరుపయోగంగా ఉంది. మండపం భూమి లోపలికి ఉండిపోవడంతో అందులో ఎటువంటి వాడకం లేకుండా నిరుపయోగమైన టీటీడీ వస్తు సామాగ్రిని అందులో ఉంచారు.