5వ రోజు కొనసాగుతున్న డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులు

5వ రోజు కొనసాగుతున్న డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులు

హైదరాబాద్ : ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన రాంగోపాల్ పేటలోని డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులు 5వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 50 శాతం కూల్చివేత పనులు పూర్తయ్యాయి. మరో 50 శాతం కూల్చివేత ప్రక్రియ ఉంది. 2 లేదా 3 రోజుల్లో బిల్డింగ్ ను మొత్తం కూల్చివేయనున్నారు. కూల్చివేత పనులను స్థానిక కార్పొరేటర్ దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే బిల్డింగ్ ముందు భాగాన్ని కూల్చివేశారు. 

ఇవాళ మధ్యాహ్నం వెనక భాగం కూల్చివేత పనులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బిల్డింగ్ వెనకాల ఉన్న బస్తీ వాసులతో పాటు సుమారు 15 అపార్ట్ మెంట్స్, హాస్టల్స్ ను ఖాళీ చేయించారు. మరోవైపు.. 10 రోజులుగా బిల్డింగ్ చుక్కపక్కల ప్రాంతాల్లో కరెంట్ సరఫరాను నిలిపివేశారు. బిల్డింగ్ మొత్తాన్ని కూల్చివేసిన తర్వాత కరెంట్ సరఫరాను పునరుద్ధరించనున్నామని రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.