పేదలు, రైతులపై డీమానిటైజేషన్ తో దాడి

పేదలు, రైతులపై డీమానిటైజేషన్ తో దాడి

కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కేంద్ర సర్కార్ పై వరుసగా విమర్శలకు దిగుతున్న కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. పెద్ద నోట్ల రద్దు వెనుక లిక్విడ్ క్యాష్ తో నడిచే దేశ అవ్యవస్థీకృత రంగాన్ని దెబ్బ తీయాలనే కుట్ర దాగుందని ఆరోపించారు. తాజా వీడియో సిరీస్ లో భాగంగా 2016లో కేంద్రం చేపట్టిన డీమానిటైజేషన్ ను ఇండియాలోని పేదలు, వ్యవసాయదారులు, శ్రామికులు, చిల్లర కొట్టు యజమానులపై చేసిన దాడిగా రాహుల్ పేర్కొన్నారు. రూ.500, రూ.1,000 లాంటి పెద్ద నోట్ల రద్దు వెనుక ఉన్న రహస్య ఎజెండా ఉందని, అది గ్రౌండ్ లెవల్ లో ప్రతి దాన్ని నాశనం చేయడమేనని విమర్శించారు.

‘మన అవ్యవస్థకృత రంగం డబ్బు మీద ఆధారపడి పని చేస్తుంది. చిల్లర కొట్టు యజమానులు, శ్రామికుల మనుగడ డబ్బుపైనే ఆధారపడి ఉంది. పెద్ద నోట్ల రద్దు రెండో లక్ష్యం అవ్యవస్థీకృత రంగం నుంచి డబ్బులు దండుకోవడమే. తాను క్యాషె లెస్ నేషన్ ను కోరుకుంటున్నట్లు ప్రధాని మోడీ చెప్పారు. ఒకవేళ ఇండియా క్యాష్ లెస్ గా ముందుకెళ్తే.. చిన్న షాపుల యజమానులు, రైతులు, వర్కర్స్ కథ ముగిసినట్లే’ అని రాహుల్ పేర్కొన్నారు.