ఆ మొబైల్ గేమ్ ఇండియాకు మళ్లీ వచ్చేస్తోంది.. అప్పట్లో పిల్లలను పిచ్చెక్కించేసిన గేమ్ ఇది..!

ఆ మొబైల్ గేమ్ ఇండియాకు మళ్లీ వచ్చేస్తోంది.. అప్పట్లో పిల్లలను పిచ్చెక్కించేసిన గేమ్ ఇది..!

చాలా కాలం  తర్వాత  గేమింగ్ ప్రియులకు  ఓ గుడ్ న్యూస్  వచ్చింది.  భారతదేశంలో ఎంతో మంది అభిమానులను  సంపాదించుకున్న ఫ్రీ ఫైర్ గేమ్ ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఇండియా పేరుతో మళ్ళీ రాబోతోంది. సుమారు 3.5 సంవత్సరాల క్రితం అంటే 2022లో భద్రతా కారణాల వల్ల భారత ప్రభుత్వం ఈ గేమ్‌ను నిషేధించిన సంగతి మీకు తెలిసిందే. అయితే అప్పట్లో ఎంతో మంది ఈ ఫ్రీ ఫైర్‌ను చాలా ఇష్టంగా ఆడేవారు.

ఈ గేమ్ రి ఎంట్రీకి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే గత ఏడాది ఆగస్టులో ఫ్రీ ఫైర్ ఇండియా  పేరుతో గేమ్ మళ్ళి వస్తుందని వార్తలు వచ్చాయి, దాన్ని కంపెనీ కూడా స్వయంగా స్పష్టం చేసింది. అయితే దురదృష్టవశాత్తు కొన్ని రోజులకే ఆ లాంచ్ వాయిదా పడింది. దింతో ఈ వార్త గేమర్‌లకు మళ్ళీ నిరాశ మిగిల్చింది. 2024 చివర్లో కూడా కొత్త ఏడాదిలో  ఈ గేమ్ లాంచ్ అవుతుందని ఆశించారు, అదీ కూడా జరగలేదు.

మరోవైపు సింగపూర్‌ చెందిన ఈ గేమింగ్ కంపెనీ అధికారికంగా ఈ విషయాన్నీ ప్రకటించింది. BGMIలాగానే ఫ్రీ ఫైర్ కూడా 'ఫ్రీ ఫైర్ ఇండియా' అనే కొత్త పేరుతో తిరిగి వస్తోంది. ఇది ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంది, ప్రీ-రిజిస్ట్రేషన్ కూడా మొదలయ్యాయి. రిజిస్టర్ చేసుకున్న వారు త్వరలోనే గేమ్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూలై 13న ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఇండియా టోర్నమెంట్ నాటికి గేమ్ అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు. మీరు ముందుగా రిజిస్టర్ చేసుకుంటే గేమ్ ఆటోమేటిక్‌గా మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ అవుతుంది.

►ALSO READ | పిల్లలపై ప్రేమతో దివాళా తీస్తున్న రిటైర్డ్ పేరెంట్స్ : ATMలా వాడేస్తున్న కొడుకులు, కూతుళ్లు!

గేమ్ రిఎంట్రీతో భారతదేశంలో ఫ్రీ ఫైర్ కోసం ఓ ఈ-స్పోర్ట్స్ టోర్నమెంట్ కూడా నిర్వహిస్తోంది. జూలై 7 నుండే ఈ టోర్నమెంట్ కోసం రిజిస్ట్రేషన్లు మొదలవగా, జూలై 13 వరకు చేసుకోవచ్చు. జూలై 13 నుండి సెప్టెంబర్ 28 వరకు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఇండియా కప్  జరగనుంది. మొదట ఇన్-గేమ్ క్వాలిఫైయర్స్, ఆ తర్వాత ఆన్‌లైన్ క్వాలిఫైయర్స్, తరువాత లీగ్, చివరగా గ్రాండ్ ఫినాలే ఉంటుంది.