కోపెన్‌హాగెన్: గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికాకు డెన్మార్క్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ‘‘ముందు కాలుస్తాం, ఆ తర్వాతే ప్రశ్నలు అడుగుతాం’’ అని వార్నింగ్ ఇచ్చింది. గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని కొంటామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లపై డెన్మార్క్ తీవ్రంగా స్పందించింది. 2019లోనూ ఆయన ఇదే తరహా కామెంట్లు చేశారని ఫైర్ అయింది.
గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఘాటుగా స్పందించింది. ‘‘ఎవరైనా (అమెరికా బలగాలు) మా అనుమతి లేకుండా గ్రీన్‌లాండ్ గడ్డపై కాలు పెడితే, చర్చలు జరపం.. నేరుగా కాల్పులు జరుపుతాం (యుద్ధం చేస్తాం)’’ అని డెన్మార్క్‌కు చెందిన ఓ సీనియర్ డిఫెన్స్ ఆఫీసర్ హెచ్చరించారు. ఒక నాటో మిత్రదేశమైన అమెరికాను ఉద్దేశించి డెన్మార్క్ ఇలాంటి కామెంట్లు చేయడం ఇదే ఫస్ట్ టైమ్.
