ముషీరాబాద్, వెలుగు: రోగికి అత్యవసర సమయంలో రక్తదానం చేయడం అనేక ప్రాణదానంతో సమానమని ప్రముఖ డాక్టర్ సంధ్యా రత్నం పేర్కొన్నారు. గురువారం బాగ్ లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్స్ లో డెంటల్ హెల్త్ క్యాంపుతో పాటు గాంధీ ఆస్పత్రి సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఫ్యాకల్టీ, డెంటల్ సమస్యలను పరీక్షించుకోగా మరికొందరు రక్తదానం చేశారు.
అనంతరం డాక్టర్ సంధ్యా రత్నం మాట్లాడుతూ విద్యార్థులు, ఫ్యాకల్టీ బ్లడ్ డొనేషన్ చేయడం హర్షణీయమన్నారు. డెంటల్ డాక్టర్ నదీమ్ నేతృత్వంలో 120 మందికి పైగా విద్యార్థులు ఫ్యాకల్టీ దంత పరీక్షలు చేయించుకొని అనేక సూచనలు సలహాలు పొందారు. కార్యక్రమంలో డాక్టర్ స్నేహ, డాక్టర్ ప్రవీణ్, అతుల్, ఫరోద్దిన్, దేవేందర్, వెంకటనాయక్ తోపాటు ఇనిస్టిట్యూషన్స్ ఫ్యాకల్టీ , విద్యార్థులు పాల్గొన్నారు.
