శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు పట్టణానికి చెందిన ముత్యాల విజయ్(40) అతడి భార్య శ్రావ్య(35) కలిసి శంషాబాద్ పట్టణంలోని సామ ఎన్ క్లేవ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. శ్రావ్య 8 నెలల గర్భిణి కావడంతో ఆదివారం రాత్రి ఆమెకు కడుపునొప్పి వచ్చింది.
ఆమె తల్లి సరోజ వెంటనే అత్తాపూర్ లోని బటర్ఫ్లై హాస్పిటల్ కు తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షించి గర్భిణి కడుపులో ఉన్న ఇద్దరు కవలలు మృతి చెందినట్లు చెప్పారు. ఆమె పరిస్థితి సైతం విషమంగా ఉండడంతో అక్కడి నుంచి మరో హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతున్న సోమవారం తెల్లవారుజామున శ్రావ్య మృతి చెందారు. భార్య మృతిని తట్టుకోలేక భర్త గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు.
