పద్మారావునగర్, వెలుగు : జీహెచ్ఎంసీ షాపింగ్ కాంప్లెక్స్ లోని మొత్తం 15 దుకాణాలకు ఓపెన్ వేలం వేసి అర్హులకు కేటాయించాలని కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు చిరంజీవి అధికారులను కోరారు. ఈ మేరకు సోమవారం సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీ నార్త్ జోన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. బన్సీలాల్ పేట డివిజన్లోని న్యూబోయిగూడ, ఐడీహెచ్ కాలనీ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్ లో 15 దుకాణాలకు ఓపెన్ వేలం వేయాలని కోరారు.
