UOHలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు.. డిగ్రీ, పిజి చదివినవారు అప్లయ్ చేసుకోవచ్చు..

 UOHలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు.. డిగ్రీ, పిజి చదివినవారు అప్లయ్ చేసుకోవచ్చు..

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH) ప్రాజెక్ట్ అసోసియేట్ I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు  ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్‌ను సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 27.

పోస్టులు: 05. ప్రాజెక్ట్ అసోసియేట్ I.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి  నేచురల్ సైన్సెస్​లో  నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీ / నేచురల్ సైన్సెస్​లో మాస్టర్స్ డిగ్రీ / ఎం. ఫార్మ్  పూర్తి చేసి ఉండాలి. 

కావల్సిన అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి జీవ శాస్త్రాలు / బయోకెమిస్ట్రీ / బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ లేదా సమాన అర్హత ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్:  ఆఫ్‌లైన్‌ ద్వారా.

లాస్ట్ డేట్: నవంబర్ 27. 

సెలెక్షన్ ప్రాసెస్​: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు uohyd.ac.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.