- లోకల్ బాడీ ఎన్నికలపై చర్చ?
రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్లలో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలతో సోమవారం సమావేశమయ్యారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో రానున్న స్థానిక ఎన్నికలపై మండలాల వారీగా లీడర్లు, కార్యకర్తలతో చర్చించారు.
త్వరలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్న నేపథ్యంలో గతంలోనే గ్రామాల్లో పార్టీ విజయావకాశాలపై నిర్వహించిన సర్వేపై ఆయా లీడర్లతో చర్చించినట్టు సమాచారం. అనంతరం బీఆర్‌ఎస్ నేత బొల్లి రామ్మోహన్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ నాయకులతో సమావేశమయ్యారు. ఆటో కార్మికులకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని, పార్టీ తరఫున ఇన్సురెన్స్ చేయిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
