తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. బైకర్ తలపై పడ్డ రాయి.. తీవ్ర గాయాలు

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. బైకర్ తలపై పడ్డ రాయి.. తీవ్ర గాయాలు

తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం జరిగింది.. మంగళవారం ( నవంబర్ 18 ) తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో హరిణి ప్రాంతంలో వెళ్తున్న బైకర్ పై చిన్న రాయి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తిరుమలలోని లగేజి సెంటర్లో వెండార్ గా పని చేస్తున్న లోకేష్ డ్యూటీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రెండవ ఘాట్ రోడ్డులోని హరిణి ప్రాంతం దగ్గర లోకేష్ పై చిన్న రాయి పడటంతో ఒక్కసారిగా కిందపడ్డాడు. దీంతో లోకేష్ తలకు శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటనలో గాయపడ్డ లోకేష్ ను మొదట అశ్విని ఆసుపత్రికి ప్రధమ చికిత్స అందించిన తర్వాత తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం లోకేష్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. నిన్న రాత్రి నుంచి తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్న క్రమంలో రాయి పడి ఉండచ్చని భావిస్తున్నారు. వర్షం కురిసే సమయంలో ఘాట్ రోడ్డులో బైక్ పై వెళ్లేవారు జాగ్రత్తఘా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.