శరవేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు : విప్ ఆది శ్రీనివాస్

శరవేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు :  విప్ ఆది శ్రీనివాస్
  •     విప్ ​ఆది శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం వేములవాడ నియోజకవర్గంలో శరవేగంగా సాగుతోందని ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​ అన్నారు. వేములవాడ పట్టణంలోని 9వ వార్డులో రామతీర్థపు పద్మ ఇందిరమ్మ ఇల్లు పూర్తికాగా.. సోమవారం గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. లబ్ధిదారుకు కొత్త బట్టలు పెట్టారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు ప్రభుత్వం పక్కా ఇండ్లు కట్టిస్తోందన్నారు. మున్సిపల్​కమిషనర్‌‌‌‌‌‌‌‌ అన్వేష్​, పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌, రాకేశ్‌‌‌‌, బింగి మహేశ్‌‌‌‌, కొమురయ్య, పుల్కం రాజు, చిలుక రమేశ్‌‌‌‌, రాజు, మైలారం రాము పాల్గొన్నారు. 

కోనరావుపేట, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌తోనే పేదల సొంతింటి కల నెరవేరిందని, దీంతో లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో ఇప్ప శిరీష–వేణు దంపతులకు మంజూరైన ఇల్లు పూర్తికాగా సోమవారం గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా వారికి విప్ ఆది శ్రీనివాస్‌‌‌‌ కొత్త బట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, సింగిల్ విండో చైర్మన్ నరసయ్య, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో స్నిగ్ధ, లీడర్లు తదితరులు పాల్గొన్నారు.