
వయసు పైబడుతున్న కొద్దీ వృద్ధుల్లో పళ్లు ఊడిపోతాయి. ఈ వయసులో ఒకసారి ఊడిపోతే అవి మళ్లీ తిరిగి రావడం కష్టం. అయితే వైద్యులు కృత్రిమ దంతాలను ఏర్పాటు చేస్తారు. కానీ, అవి అంత దృఢంగా ఉండవు. పైగా ఎప్పుడూ నొప్పి కలిగిస్తాయి. అయితే ఈ వయసులో కూడా దంతాలు మళ్లీ పెరిగే కొత్త టెక్నిక్‌ను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. న్యూయార్క్‌కు చెందిన కొలంబియా యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు కొన్ని ఎలుకలపై జరిపిన అధ్యయనం సత్ఫలితాలనిచ్చింది. మూల కణాల ద్వారా దంతాలను అభివృద్ధి చేయొచ్చని వాళ్లంటున్నారు.
శాస్త్రవేత్తలు మూల కణాలతో కృత్రిమ దంతాలను పోలిన ఎముకల వంటి భాగాన్ని రూపొందించారు. దీన్ని ఎలుకల చిగుళ్లలోని ఖాళీ స్థలంలో ఏర్పాటు చేశారు. తొమ్మిది వారాల్లోనే అవి చిగుళ్లతో కలిసిపోయి, దంతాలుగా ఎదిగాయి. ఎలుకల్లో ఊడిపోయిన దంతాలు మళ్లీ పెరిగాయి. ఇదే ప్రయోగం ఇప్పుడు మనుషులపైనా చేయనున్నారు. ఇది కూడా విజయవంతమైతే మనుషుల్లోనూ ఏ వయసులోనైనా ఊడిపోయిన దంతాలు తిరిగి పెరుగుతాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.