వెల్లుల్లి క్యాప్సూల్స్ తయారీ యోచనలో ఉద్యాన శాఖ

వెల్లుల్లి క్యాప్సూల్స్ తయారీ యోచనలో ఉద్యాన శాఖ

హైదరాబాద్, వెలుగు: యాంటీ బ్యాక్టీరియల్​ గుణాలున్న వెల్లుల్లి (గార్లిక్) క్యాప్సూల్స్​ను తయారు చేసి, విక్రయించాలని రాష్ట్ర హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ యోచిస్తోంది. ఇంట్రెస్ట్​ఉన్నవారికి కొంత ట్రైనింగ్​ ఇచ్చి, ప్రాసెసింగ్ ​యూనిట్ ​ఇప్పిస్తే.. ఎంప్లాయ్​మెంట్ తో పాటు మంచి లాభాలు వస్తాయని భావిస్తోంది. ఈ మేరకు ప్రపోజల్స్ రెడీ చేసింది. ఇప్పటికే రాజస్థాన్ లోని కోటా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో మహిళలు గార్లిక్ క్యాప్సూల్స్ తయారీలో సక్సెస్​ అయ్యారు. కీళ్ల నొప్పులు, క్యాన్సర్​ వంటి జబ్బులకు గార్లిక్ మంచి మెడిసిన్ లా పనిచేస్తుండటంతో క్యాప్యూల్స్​కు రూపంలో తీసుకునేందుకు దేశవ్యాప్తంగా డిమాండ్​ పెరిగింది. గార్లిక్​పౌడర్, క్యాప్సూల్స్​తయారీపై స్టడీ చేసిన మన స్టేట్ ఆఫీసర్లు.. కేవీకే నుంచి వివరాలు సేకరించారు.

రోజుకు రూ.20 వేల లాభం

గార్లిక్ క్యాప్యూల్స్ తయారీకి మొత్తం మూడు మెషీన్లు అవసరం అవుతాయని అధికారులు తెలిపారు. గార్లిక్ ​గ్రేడింగ్ చేసి, పొట్టును వేరు చేసేందుకు.. ఆ తర్వాత పౌడర్​గా మార్చేందుకు ఈ మెషీన్లు పనిచేస్తాయి. రోజుకు 80 కిలోల వరకు పౌడర్​ ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉన్న ఈ మెషీన్లు రూ.60 వేల లోపు దొరుకుతాయి. కేజీ వెల్లుల్లితో వంద గ్రాముల పౌడర్​ తయారవుతుంది. హోల్​సేల్​గా కిలో వెల్లుల్లి రూ.20 చొప్పున 8 క్వింటాళ్లు తీసుకుంటే రూ.16 వేలు ఖర్చవుతుంది. దీనిని ఎండబెట్టి పొట్టును వేరు చేసిన తర్వాత పొడి చేసి నలుగురు మహిళా వర్కర్స్ తో క్యాప్సూల్స్​లో నింపిస్తారు. రోజుకు కిలో పౌడర్​ఉత్పత్తికి రూ.226 చొప్పున 80 కిలోలకు రూ.18 వేలు ఖర్చవుతోంది. మార్కెట్​లో కిలోకు రూ.500 వరకు అమ్ముడుపోతుంది. ఇలా వచ్చిన మొత్తంలో వర్కర్స్​కాస్ట్​, ముడి సరుకు, ఇతర ఖర్చులు తీసేయగా రూ.20 వేల వరకు నెట్ ​ప్రాఫిట్ వస్తుందని ఆఫీసర్లు చెప్తున్నరు. ఒక్కోదాంట్లో 500 మిల్లీగ్రాముల చొప్పున కిలో గార్లిక్ పౌడర్​తో రెండువేల క్యాప్సూల్స్​తయారు చేయొచ్చని, ఒక్కో క్యాప్సూల్​ను 50 పైసలకు అమ్మినా.. కిలోకు రూ. వెయ్యి వస్తాయని చెప్తున్నారు. వెల్లుల్లి వాసన రాకుండా అందులో జంతు పదార్థాల నుంచి సేకరించే ప్రొటీన్​(యానిమల్​జెలాటిన్), బియ్యం పొట్టును వాడుతున్నరు.

ఇవి కూడా చదవండి

ఐదు ఆప్షన్స్​, నాలుగు బబుల్స్​..NMMS ఎగ్జామ్‌లో బ్లండర్

రేషన్ ​కార్డులు లేవని లోన్లు ఇస్తలేరు

ఆర్టీఏ సేవలకు ఆధార్ తప్పనిసరి

వరి సాగులో ఆల్‌‌టైమ్‌‌ రికార్డ్‌‌