9:15 గంటలకల్లా ఆఫీసులో ఉండాలి..కేంద్ర ఉద్యోగులకు డీవోపీటీ ఆర్డర్​

9:15 గంటలకల్లా ఆఫీసులో ఉండాలి..కేంద్ర ఉద్యోగులకు డీవోపీటీ ఆర్డర్​

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉదయం 9 .15 గంటలకే ఆఫీసుల్లో ఉండాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ (డీవోపీటీ) ఆదేశాలిచ్చింది. సమయ పాలన పాటించకపోతే హాఫ్ డే లీవ్ కింద పరిగణించి సాలరీ కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.

బయోమెట్రిక్ విధానం కచ్చితంగా ఫాలో కావాలని లేదంటే శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. సెలవుల గురించి ముందుగానే  ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని, నోటీసు ఇచ్చి ఆ తర్వాత సెలవులు తీసుకోవాలని చెప్పింది.

ప్రస్తుతం ఉద్యోగుల ఆఫీసు వేళలు ఉదయం 9 నుంచి 5.30.. ఇందులో 15 నిమిషాలు ఆలస్యం అంటే 9.15 గంటల వరకు మాత్రమే ఎలాంటి చర్యలు లేకుండా ఉద్యోగి హాజరును పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది.