టొరంటో: కరోనా మహమ్మారి ఎఫెక్ట్ గర్భంతో ఉన్న మహిళలు, కొత్తగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లుల మెంటల్ హెల్త్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తుందంట. కరోనా భయంతో చాలా మంది డిప్రెషన్, ఆందోళనకు గురవుతున్నారంట. ఇది తల్లి, బిడ్డల హెల్త్ పై చాలా కాలం ప్రభావం చూపుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఫిజికల్ డిస్టెన్స్, ఐసోలేషన్ లాంటి చర్యలు ప్రెగ్నెంట్ ఉమెన్, కొత్తగా తల్లులైన వారి ఫిజికల్, మెంటల్ హెల్త్ పై ప్రభావం చూపిస్తున్నాయని కెనడాలోని అల్ బెర్టా యూనివర్సిటీ లేటెస్ట్ గా చేసిన స్డడీలో తేలింది. ఇందులోని కీలకాంశాలను “ది జర్నల్ ఫ్రాంటీయర్స్ ఇన్ గ్లోబల్ ఉమెన్స్ హెల్త్” అనే పేపర్ లో పబ్లిష్ చేశారు. ఈ స్టడీలో 900 మంది ఆడవాళ్ల అభిప్రాయాలు తీసుకున్నారు. వీరిలో 520 మంది ప్రెగ్నెంట్స్ కాగా 380 మంది ఏడాది కిందట పిల్లలకు జన్మనిచ్చిన వారు ఉన్నారు. వీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లేదంటే డెలీవరి తర్వాత ఎలాంటి డిప్రెషన్, ఆందోళనకు గురయ్యారన్నది తెలుసుకునేందుకు సర్వే చేశారు. మహమ్మారికి ముందు 29 శాతం గర్భిణుల్లో మామూలు నుంచి హై లెవెల్ లో ఆందోళన ఉండేదని…15 శాతం మహిళలు డిప్రెషన్ కు గురైనట్లు గ్రహించారు. కరోనా ఎఫెక్ట్ మొదలయ్యాక డిప్రెషన్, ఆందోళనల స్థాయి భారీగా పెరిగింది. ఈ సమయంలో గర్భిణిలు లేదా బిడ్డకు జన్మనిచ్చిన తల్లుల్లో 72 శాతం తీవ్ర ఆందోళనకు గురయ్యారంట. 41 మంది మహిళలు డిప్రెషన్ తో బాధపడ్డారని గుర్తించారు. లాక్ డౌన్ కారణంగా 64 శాతం మంది ఫిజికల్ యాక్టివిటీకి పూర్తిగా దూరంగా ఉన్నారంట. సాధారణంగా గర్భంతో ఉన్నవారు వారంలో కనీసం 150 నిమిషాల పాటు సాధారణ ఎక్ససైజ్ అయినా చేయాల్సి ఉంటుంది. ఇలా ఫిజికల్ యాక్టివిటీ మానేయటంతో చాలా మందిలో డిప్రెషన్ సింప్టమ్స్ పెరిగాయని గుర్తించారు. “ప్రెగ్నెన్సీ సమయంలో డిప్రెషన్, ఆందోళన అనేది తల్లి, పిల్లల ఇద్దరి హెల్త్ పై కొన్ని ఏళ్ల పాటు మానసికంగా ఎఫెక్ట్ చూపుతుంది” అని ఈ స్డడీకి కో అథర్ గా వ్యవహారించిన డావెన్ పోర్ట్ చెప్పారు.
