మైనార్టీలకు ప్రాధాన్యమిచ్చింది కేసీఆరే

మైనార్టీలకు ప్రాధాన్యమిచ్చింది కేసీఆరే

ఖమ్మం , వెలుగు:
దేశంలోనే మైనార్టీలకు అత్యధిక బడ్జెట్‌ కేటాయించింది కేసీఆరేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‍ అలీ అన్నారు. ఖమ్మంలోని చెర్వు బజార్‍ మదర్సాలో సోమవారం నిర్వహించిన ముస్లిం ల ఆత్మీయ సమ్మేళనంలో టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‍ తో కలిసి ఆయన పాల్గొ న్నారు. ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వమూ రెవెన్యూ లాంటి కీలక
శాఖ ముస్లిం లకు ఇవ్వలేదని, కేసీఆర్‍ మాత్రమే రెవెన్యూ శాఖ ఇచ్చి తనను డిప్యూటీ సీఎం చేశారని అన్నారు. టీఆర్ఎస్ కు బీజేపీతో అవగాహన ఉందని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తు న్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వమని, దేశంలో
కేసీఆరే పెద్ద సెక్యులరిస్టని ఆయన అన్నారు. వక్ఫ్ ఆస్తు లను పరిరక్షించామని చెప్పా రు. అజయ్ ని ఎమ్మెల్యే, కేసీఆర్ ను సీఎం చేసేం దుకు ముస్లిం లంతా కారు గుర్తు కు ఓటు వేయాలని మహమూద్‍ అలీ కోరారు. పువ్వాడ అజయ్‍ మాట్లాడుతూ ముస్లిం , మైనార్టీలకు కేసీఆర్‍ ప్రభుత్వం అండగా ఉందన్నారు. టీఆర్ఎస్‍ జిల్లా అధ్యక్షుడు బుడాన్‍ బేగ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్‍ ఖమర్‍, ముస్లిం మత పెద్దలు ఈ సమావేశంలో పాల్గొ న్నారు.