- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు: మిషన్ భగీరథ పథకం ప్రజలకు నీళ్లివ్వడం కోసం తెచ్చారా? లేక పైపుల కంపెనీల ప్రయోజనం కోసం తెచ్చారా? అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పద్దులపై చర్చను పక్కనపెట్టి, గత పదేండ్ల కేసీఆర్ పాలన గురించి గొప్పలు చెప్పుకోవడమే లక్ష్యంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. మిషన్ భగీరథ పనితీరుపై అనుమానాలుంటే కమిటీ వేద్దామని, ఊరూరా తిరిగి వాస్తవాలు పరిశీలిద్దామని ప్రతిపక్ష నేతలకు సవాల్ విసిరారు.
గురువారం ఆయన అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కల్యాణ లక్ష్మి జాప్యంపై విచారణ కల్యాణ లక్ష్మిపై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను భట్టి తప్పుపట్టారు. పెళ్లై బిడ్డ సంకలోకి వచ్చినా కల్యాణ లక్ష్మి చెక్కు అందలేదనేది వాస్తవమైతే దానికి గల కారణాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు.
