
నల్లమల డిక్లరేషన్ ను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నాగర్ కర్నూల్ లో ఇందిరా సౌరగిరి జలవికాస పథకం ప్రారంభం సందర్భంగా మాట్లాడిన భట్టి..నల్లమల డిక్లరేషన్ నాలుగేండ్లు అమలు చేసి తీరుతామని చెప్పారు. దీని వల్ల గిరిజన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయన్నారు. నల్లమల డిక్లరేషన్ ఫలితాలు ప్రజలకు చూపిస్తామన్నారు. తాము కల్లారా చూసిన సమస్యలే ఈ నల్లమల డిక్లరేషన్ అని అన్నారు.
సభలో మాట్లాడిన భట్టి. .12వేల 600 కోట్లతో ఇందిరా సౌర గిరి జల వికాస పథకం తెచ్చాం.. దేశంలోనే గర్వించ దగ్గ గొప్ప కార్యక్రమం. గతంలో అడవి భూములపై గిరిజనులకు హక్కులు లేవు
►ALSO READ | లింగమ్మ ఏం సంగతి..?.. సీతక్కను అడగండి.. మీకు ఇండ్లు ఈ సారే ఇస్తడు: రేవంత్
రాష్ట్రంలోని గిరిజన కుటుంబాలకు ఇది శుభదినం. భూమి కోసం,భుక్తికోసం దశాబ్ధాలుగా కొనసాగిన పోరాటం ఇది. గిరిజన కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. సంపద సృష్టిస్తాం..ప్రజలకు పంచుతాం. రూ.1000కోట్లతో రాజీవ్ యువ వికాసం తీసుకొచ్చాం. ఈపథకాలు మామూలు ప్రభుత్వాలు చేయలేవు. ప్రజలపై ప్రేమ ఉన్న ప్రభుత్వాలకే ఇది సాధ్యం. ఈపథకాలు ఆరంభం మాత్రమే..ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలను విమర్శించినట్లే. పదేళ్లు పాలించిన పార్టీ ఒక్కసారైనా విద్యగురించి ఆలోచించిందా.? అని అన్నారు.