
హైదరాబాద్ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు హైదరాబాద్ సిటీ పోలీస్ లు. చౌమొహల్లా ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హోంమంత్రి మహమూద్ ఆలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, సీఎస్ ఎస్ కే.జోషి, ఆడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, ముస్లిం మతపెద్దలు, అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు.