ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం రాజుకున్న క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న తిరుమలలో ఈ దీక్షను విరమించనున్నారు పవన్. ఇందులో భాగంగా ఇవాళ (అక్టోబర్ 1, 2024 ) తిరుపతికి చేరుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకొంటూ తిరుమలకు చేరుకున్నారు. రేపు ( అక్టోబర్ 2, 2024 ) ఉదయం స్వామివారిని దర్శించుకొని దీక్షను విరమించనున్నారు పవన్ కళ్యాణ్.
Also Read :- ఉన్న సమాచారాన్ని మాత్రమే సీఎం చెప్పారు
ప్రాయశ్చిత్త దీక్ష విరమణ అనంతరం రేపు ( అక్టోబర్ 2, 2024 ) తిరుమలలోనే గడపనున్నారు పవన్ కళ్యాణ్. అక్టోబర్ 3న తిరుపతిలో వారాహి సభలో పాల్గొననున్నారు పవన్. కాగా.. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన క్రమంలో నెలకొన్న తాజా పరిణామాలపై స్పందించారు డిప్యూటీ సీఎం. తిరుమల లడ్డూ వివాదం విషయంలో ఉన్న సమాచారాన్ని మాత్రమే సీఎం చంద్రబాబు చెప్పారని.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని.. ప్రభుత్వం అన్నింటిపై విచారణ జరుపుతుందని అన్నారు పవన్ కళ్యాణ్.