లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‎గా ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కలెక్టర్ రాజు

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‎గా ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కలెక్టర్ రాజు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ రాజు ఏసీబీకి పట్టుబడ్డారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు డిప్యూటీ కలెక్టర్ రాజును రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ తహశీల్దార్ సతీష్ కూడా ఏసీబీ అధికారులకు చిక్కారు. 

వివరాల ప్రకారం.. గురువారం (జూలై 10) జహీరాబాద్ నిమ్జ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. భూసేకరణ పరిహారం చెక్కులు ఇచ్చేందుకు రూ.65 వేలు లంచం తీసుకుంటుండగా నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహశీల్దార్ సతీష్‎ ఏసీబీకి పట్టుబడ్డారు. డ్రైవర్ వద్ద నగదు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ALSO READ | Tax Raids: పన్నుశాఖ కొత్త బాంబ్.. లగ్జరీ ఇళ్ల యజమానులే టార్గెట్, ఏం చేస్తోందంటే?

డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న రాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోవడం చర్చనీయాంశంగా మారింది. చిన్నస్థాయి ఉద్యోగులను సరైన పద్దతిలో నడించాల్సిన ఉన్నతాధికారులు కూడా లంచాలు తీసుకోవడమేంటంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.