
మేడిపల్లి, వెలుగు: మేడిపల్లి పీఎస్ పరిధిలోని పీర్జాదిగూడ కోఆప్షన్‌సభ్యుడు జగదీశ్వర్‌రెడ్డి ఆఫీసులో ఆదివారం రాత్రి డిప్యూటీ మేయర్సహా ఏడుగురు బీఆర్ఎస్లీడర్లు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కోఆప్షన్‌సభ్యుడు జగదీశ్వర్‌రెడ్డి, కార్పొరేటర్ మహేశ్, డిప్యూటీ మేయర్ శివకుమార్‌గౌడ్, కార్పొరేటర్ల భర్తలు నలుగురు మహేశ్, కృష్ణ, రఘుపతిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కొందరు బిల్డర్లు ఉన్నట్లు తెలిసింది. ఘటనా స్థలంలో లిక్కర్బాటిల్స్, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎస్ఓటీ పోలీసులు సమాచారం ఇచ్చినా మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 3 గంటలపాటు కరెంటు తీసివేసి కార్పొరేటర్లను తప్పించే ప్రయత్నం చేసిట్లు తెలిసింది.
కాంగ్రెస్ లీడర్ సహా ఆరుగురు
గచ్చిబౌలి: పేకాట ఆడుతూ ఓ కాంగ్రెస్ నేత పోలీసులకు చిక్కిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ లీడర్‌తోపాటు పేకాట ఆడుతున్న మరో ఐదుగురిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన కాంగ్రెస్ లీడర్ గొట్టిముక్కల వెంగళరావుకు కొండాపూర్ రాఘవేంద్రకాలనీలో గెస్ట్‌హౌజ్ ఉంది. ఆ గెస్ట్‌హౌజ్‌లో ఈ నెల 16న వెంగళరావుతో పాటు మరో ఐదుగురు పేకాట ఆడుతున్నట్లు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకుని వారికి అదుపులోకి తీసుకున్నారు. రూ.లక్ష 27 వేల క్యాష్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు.