
న్యూఢిల్లీ: విదేశీ మార్కెట్లలో ధరలు తగ్గడంతో గురువారం దేశ రాజధానిలో బంగారం ధరలు రూ.1,800 పడిపోయి రూ.95,050కి చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి 10 గ్రాముల ధర రూ.1,800 తగ్గి రూ.94,600కి చేరుకుంది. అయితే బుధవారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ. 96,850 ఉండగా, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ. 96,400 వద్ద ముగిసింది.
"పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల నుంచి వైదొలగడంతో బంగారం ధరలు తగ్గుతున్నాయి. 90 రోజుల పాటు సుంకాలను తగ్గించడానికి అమెరికా, చైనా ఒప్పుకోవడం వాణిజ్య యుద్ధం భయాలను తగ్గించింది. అనిశ్చితి తగ్గుతున్న కొద్దీ, పెట్టుబడిదారులు రిస్కు ఉండే ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల బంగారానికి డిమాండ్ తగ్గుతోంది’’" అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా అన్నారు. వెండి ధరలు కిలోకు రూ. 1,000 తగ్గి రూ. 97 వేలకు చేరుకున్నాయి.