గుడ్ న్యూస్: ఈ జాబ్స్ చేసేటోళ్లకు జీతాలు పెరుగుతాయి..

గుడ్ న్యూస్: ఈ జాబ్స్ చేసేటోళ్లకు జీతాలు పెరుగుతాయి..
  • 6 శాతం పెరగనున్న బ్లూకాలర్ వర్కర్ల జీతాలు: డెలాయిట్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
     

న్యూఢిల్లీ: బ్లూ-కాలర్ వర్కర్ల (మాన్యువల్​ లేబర్స్) జీతాలు ఈ ఏడాది 5–-6 శాతం పెరుగుతాయని డెలాయిట్ రిపోర్ట్  పేర్కొంది.  చాలా కంపెనీలు స్కిల్డ్ టాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆకర్షించడానికి, ఉంచుకోవడానికి పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయని  తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం,  2025లో బ్లూ-కాలర్ రోల్స్ కోసం హైరింగ్ చేపట్టాలని చాలా కంపెనీలు భావిస్తున్నాయి. కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ యాక్టివిటీ  10 శాతం ఎక్కువగా ఉంది.  మాన్యుఫాక్చరింగ్, ఆటోమోటివ్, ఈ-–కామర్స్, లాజిస్టిక్స్ లాంటి కీలక సెక్టార్లలో స్కిల్డ్ టాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ బాగా ఉంది. 

ఈ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు జీతాలు కూడా 5-–6 శాతం రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పెరుగుతున్నాయని రిపోర్ట్ చెప్పింది. ఆటోమోటివ్, మెటల్స్ అండ్ మైనింగ్, కెమికల్స్ లాంటి సెక్టార్లలో ఆటోమేషన్, ప్రొడక్షన్ కెపాసిటీలో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ వల్ల జీతాలు స్థిరంగా 6 శాతం పెరుగుతాయని,  ఈ-–కామర్స్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లాస్ట్-మైల్ డెలివరీ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్స్, వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌసింగ్, లాజిస్టిక్స్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ వల్ల జీతాల్లో అత్యధికంగా 7 శాతం  గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుందని వెల్లడించింది.  

ఈ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  15కి పైగా ఇండస్ట్రీలకు చెందిన 200 కంపెనీల నుంచి అభిప్రాయాలను సేకరించి రెడీ చేశామని డెలాయిట్ పేర్కొంది.   కాగా,  బ్లూ-కాలర్ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేవలం 2.3 శాతం మంది మాత్రమే నెలకు రూ.60 వేల కంటే ఎక్కువ జీతం పొందుతున్నారు.  చాలావరకూ హై ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియన్స్ లేదా స్పెషలైజ్డ్ వర్కర్లకే ఎక్కువ శాలరీ అందుతోంది. ఒకే రకం పనిని పరిగణనలోకి తీసుకుంటే, మహిళల జీతాలు మగవారిలో 70 శాతం మాత్రమే ఉన్నాయి.