
- డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి సూచన
హైదరాబాద్, వెలుగు : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటూ కొందరు ఫేక్కాల్స్చేస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి సూచించారు. కొల్లూరులోని డబుల్బెడ్రూమ్ఇండ్లను ఆశచూపి పైసలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
ఇండ్లకు సంబంధించిన అధికారిక నివేదికను ప్రభుత్వ అధికారులు మాత్రమే ఇస్తారని చెప్పారు. ఫేక్కాల్స్ కు స్పందించవద్దని, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.