ఓయూ పోలీస్ స్టేషన్లో మౌలిక వసతులకు కృషి : డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్రెడ్డి

ఓయూ పోలీస్ స్టేషన్లో మౌలిక వసతులకు కృషి :  డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్రెడ్డి

తార్నాక, వెలుగు: ఓయూ పోలీస్ స్టేషన్ లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సీఐ అప్పలనాయుడు శుక్రవారం డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిని తార్నాకలోని క్యాంపు కార్యాలయంలో కలిసి విన్నవించారు. పీఎస్​ లో రోడ్ల దుస్థితి, స్ట్రీట్​ లైట్ల సమస్యలు, చెట్ల కొమ్మలు, ప్రహరీ ప్రాంతంలో నీటి సమస్యను మేయర్​కు వివరించారు. 

భద్రతను మరింత బలోపేతం చేసేందుకు అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన డిప్యూటీ మేయర్.. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. కొత్త సీసీ కెమెరాల ఏర్పాటుకు బడ్జెట్ కేటాయించేలా చొరవ చూపుతామని హామీ ఇచ్చారు.