వనపర్తి, వెలుగు: ఈవీఎం గోదామ్కు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. వనపర్తిలోని ఈవీఎం గోదాం ను శుక్రవారం అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఈవీఎంలకు కల్పిస్తున్న భద్రతను పరిశీలించారు. పోలీస్ బందోబస్తు, విధుల నిర్వహణపై ఆరా తీశారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ రమేశ్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు త్రినాథ్, పెద్దిరాజు, జమీల్, శంకర్, కుమార స్వామి, రామేశ్వరచారి పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
రేవల్లి/గోపాల్పేట: మొదటి విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం గోపాల్ పేట, రేవల్లి మండలాల్లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహణ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై ఎంపీడీవోకు అవగాహన కల్పించారు.
బ్యాలెట్ బాక్సులు, మెటీరియల్ పంపిణీ కేంద్రంలో సౌలతులు, పోలింగ్ సిబ్బందికి భోజన ఏర్పాట్లు, రూట్ వారీగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఎన్నికలు పూర్తయిన తరువాత ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక, తిరిగి బ్యాలెట్ బాక్సులు రిసెప్షన్ సెంటర్ లో అప్పగించేంత వరకు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. ఎంపీడీవోలు ఆయేషా అంజుం, ఏ కీర్తన, తహసీల్దార్లు తిలక్ రెడ్డి, లక్ష్మి ఉన్నారు.
