- కాంగ్రెస్ ఆఫీస్‌లో బాధ్యతల స్వీకరణ
మహబూబ్నగర్అర్బన్, వెలుగు: పాలమూరు జిల్లా త్వరలో సరస్వతి జిల్లాగా మారబోతోందని మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆయన ఇంటి నుంచి పార్టీ శ్రేణులతో కలిసిపార్టీ జిల్లా ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం అధ్యక్షుడి చాంబర్లో జిల్లా ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్‌రెడ్డి సమక్షంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అందరం కలిసి కట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రయారిటీ ఇస్తోందన్నారు.
జిల్లా ఎమ్మెల్యేలు పాలమూరులో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్టూడెంట్లకు ఫ్రీగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో గతంలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉండేదని.. ఇప్పుడు అక్షరాస్యత శాతం క్రమంగా పెరుగుతోందన్నారు.
రానున్న పదేండ్లలో రాష్ట్రంలో పాలమూరు జిల్లా అక్షరాస్యత శాతంలో మొదటి స్థానంలో ఉంటుందని ఆకాంక్షించారు. ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, లైబ్రరీ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, మారేపల్లి సురేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
