వంగూరు, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పిలుపునిచ్చారు. చారకొండ మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థి బలరాం గౌడ్ నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు వేగంగా అందించేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ప్రతిపక్షాల మోసపూరిత మాటలు నమ్మవద్దని సూచించారు. సర్పంచ్ అభ్యర్థి బలరాం గౌడ్, రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్ పాల్గొన్నారు.
