
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో కొందరు రకరకాల పనులు చేస్తూనే ఫోన్‌ని వాడుతుంటారు. కిచెన్‌లో వంట చేస్తూ, మిర్రర్ ముందు కూర్చుని మేకప్ వేసుకుంటూ వీడియో చాట్‌లు చేస్తుంటారు. అలాంటప్పుడు ఒక చేతితో ఫోన్‌ని పట్టుకుని, ఒకే చేతితో పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. కానీ.. బ్యాక్ కేస్‌కి ఈ ప్యాడ్ ఉంటే ఫోన్‌ని ఎలాంటి ఉపరితలానికైనా ఈజీగా స్టిక్ చేయొచ్చు. దీని వెనుక భాగంలో ఉండే కప్‌ల వల్ల సక్షన్ క్రియేట్ అవుతుంది.
దాని వల్ల అద్దం, టైల్స్, వుడ్ కప్ బోర్డ్స్.. దేనికైనా ఇది అతుక్కుంటుంది. అమెజాన్ బేసిక్స్ నుంచి వచ్చిన ఈ సిలికాన్ ప్యాడ్‌ని కేస్‌కి ఇన్‌స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ. ప్యాడ్‌కి ఉండే మొదటి పొర (స్టిక్కర్)ను తీసి, రెండో పొర (గమ్ లేయర్)ని ఫోన్ కేస్‌కి అతికించాలి. ఇది కేస్ ఉంటే ఏ పనిచేస్తున్నా హ్యాండ్స్ ఫ్రీగా సెల్ఫీ తీసుకోవడం, వీడియో చాట్ చేయడం ఈజీ అవుతుంది. దీన్ని గట్టిగా లాగితే తప్ప మళ్లీ విడదీయలేం.
ధర:185