పెళ్లికి బాజా మోగింది

పెళ్లికి బాజా మోగింది

కెరీర్‌‌‌‌లో ఫేడవుట్‌‌ అవుతున్న హీరోయిన్స్‌‌ పెళ్లిపై ఫోకస్ పెట్టడం కామన్. కానీ చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ, పర్సనల్‌‌ లైఫ్‌‌కి ప్రాధాన్యతనిస్తూ పెళ్లి బాట పడుతున్నారు నేటితరం హీరోయిన్స్. తాజాగా ఈ వరుసలో కియారా అద్వాని కూడా చేరింది. ప్రస్తుతం చరణ్‌‌కి జంటగా శంకర్ సినిమాలో నటిస్తున్న ఆమె, మరోవైపు హిందీలోనూ స్టార్‌‌‌‌ హీరోయిన్‌‌గా కొనసాగుతోంది. బాలీవుడ్‌‌ హీరో సిద్ధార్థ్‌‌ ఆనంద్‌‌తో గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న కియారా, డిసెంబర్‌‌‌‌లో పెళ్లి పీటలెక్కబోతోంది. పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొదట వివాహ వేదికగా గోవాను అనుకున్నప్పటికీ, ఆ తర్వాత  చండీగఢ్‌‌లోని ‘ది ఒబెరాయ్ సుఖ్విలాస్ స్పా అండ్ రిసార్ట్స్’కు మార్చారు. ఇక కియారాతో ప్రేమ గురించి ఆమధ్య ‘కాఫీ విత్ కరణ్‌‌’ టాక్‌‌ షోలో కియారాతో సిద్ధార్థ్‌‌ పరోక్షంగా ప్రస్తావించాడు. ఆ తర్వాత కియారాతో కలిసి ఇదే షోలో పాల్గొన్న షాహిద్ కపూర్ కూడా వీళ్ల పెళ్లి డిసెంబర్‌‌‌‌లో ఉంటుందన్నాడు. అదే ఇప్పుడు నిజం అవుతోంది. అతి త్వరలో మ్యారేజ్‌‌ డేట్‌‌ను రివీల్ చేయనున్నారు. రిసెప్షన్‌‌ను ముంబైలో ప్లాన్ చేస్తున్నారని టాక్. పెళ్లి తర్వాత కూడా కియారా వరుస సినిమాల్లో నటించబోతున్నట్టు తెలుస్తోంది.